RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసి ఆలియా భట్ ఫ్యాన్స్ గరం గరం.. సీతకు అన్యాయం జరిగిందని ఫైర్

Alia Bhatt fans disappointed with RRR trailer - ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన ఆనందంలో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. ఆలియా భట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 09:10 PM IST
RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసి ఆలియా భట్ ఫ్యాన్స్ గరం గరం.. సీతకు అన్యాయం జరిగిందని ఫైర్

Alia Bhatt fans disappointed with RRR trailer - ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన ఆనందంలో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. ఆలియా భట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన ఆలియా భట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర పోషించిన ఆలియా భట్‌కి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది వారి ఆరోపణ. 

ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటికే వివిధ సందర్భాల్లో అనేక ప్రోమో వీడియోలు బయటికి వచ్చాయి. గ్లింప్స్, టీజర్లు, చిన్న చిన్న ప్రోమోల పేరిట ఎన్నో వీడియోలు వచ్చినా.. అందులో ఎందులోనూ తమ ఫేవరైట్ హీరోయిన్ ఆలియా భట్‌కి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆలియా భట్ ఫ్యాన్స్ (Alia Bhatt fans about RRR trailer) ఆరోపిస్తున్నారు. 

Also read : RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్

ప్రోమోల్లో, టీజర్లలో ఆలియా భట్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ఆలియా భట్‌కి సరైన ప్రాధాన్యత ఉంటుందిలే అని ఆశించి సరిపెట్టుకున్నామని.. కానీ ఇవాళ రిలీజైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ (RRR Trailer reviews) చూస్తే... అందులోనూ ఆమెకు న్యాయం జరగలేదనిపించిందని ఆలియా భట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

ఇదే విషయమై ఇంకొంత మంది మరో అడుగు ముందుకేసి.. ఆలియా భట్ ఎక్కడ అని (Where is Alia Bhatt ?) అంటూ ఆర్ఆర్ ట్రైలర్ వీడియో లింక్స్ కింద ప్రశ్నిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు.

Also read : RRR trailer: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్‌లో NTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ముంబైలో RRR team

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News